వరల్డ్ చాంపియన్‌షిప్‌లో షాహిద్ అఫ్రిది జట్టుతో ఆడేందుకు భారత ఆటగాళ్ల నిరాకరణ
- ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ చాంపియన్స్ లీగ్ టోర్నీ
- ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌పై విమర్శలు
- భారత ఆటగాళ్లపై ఇటీవల షాహిద్ అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు
- పాక్ ఆర్మీకి సంఘీభావంగా ఆర్మీ శిబిరాల సందర్శన
- పాక్‌తో మ్యాచ్‌లో ఆడేది లేదని చెప్పిన ఐదుగురు భారత ఆటగాళ్లు
- మ్యాచ్ యథావిధిగా జరుగుతుందన్న డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు
ఆరు దేశాలు పాల్గొనే వరల్డ్ చాంపియన్‌షిప్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) టోర్నీలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత పరిణామలు, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి ఈ మ్యాచ్ నేడు బర్మింగ్‌హామ్‌లో జరగాల్సి ఉంది. పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాలు తలపడుతున్న తొలి మ్యాచ్ ఇదే. అయితే, భారత్-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని, మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. కాగా, డబ్ల్యూసీఎల్ గతేడాది ఎడిషన్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్.. టైటిల్‌ను అందుకుంది.