డ్రగ్స్ కేసులో ప్రియాంక్ ఖర్గే సన్నిహితుడి అరెస్ట్
లింగరాజ్ కన్ని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేతో పాటు సౌత్ కలబురిగి ఎమ్మెల్యే అల్లమ ప్రభు పాటిల్ కు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో లింగరాజ్ అరెస్టుతో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారింది. పార్టీలోనూ ఈ విషయంపై వివాదం రేగుతోంది. మరోవైపు, లింగరాజ్ కన్ని అరెస్టు నేపథ్యంలో ఆయనతో సంబంధాలు ఉన్న నేతలు, ప్రముఖుల్లో ప్రస్తుతం ఆందోళన నెలకొంది.