హైకోర్టులో సిద్ధరామయ్యకు ఊరట
- కాంగ్రెస్ నేతలపై బీజేపీ పరువునష్టం దావా
- 'అవినీతి రేటు కార్డు' ప్రకటనపై బీజేపీ దావా
- కేసును తాత్కాలికంగా నిలిపివేసిన హైకోర్టు
బీజేపీ లంచం తీసుకున్నట్టు 2023 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలో పదవులు, కాంట్రాక్టులకు లంచాల రేట్లను నిర్ణయించిందని ఆరోపించింది. ఈ ప్రకటన ద్వారా తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ బీజేపీ పరువునష్టం దావా వేసింది. ఈ కేసును ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేయడంతో కాంగ్రెస్ నేతలకు భారీ ఊరట లభించింది.