రేపు ఓటీటీకి వస్తున్న కీర్తి సురేశ్ న్యూ మూవీ!
- అమెజాన్ ప్రైమ్ లో కీర్తి సురేశ్ మూవీ
- కామెడీ డ్రామా జోనర్లో సాగే కంటెంట్
- గ్రామీణ నేపథ్యంలో కథాకథనాలు
- ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్
అయితే నిజంగానే ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను వాయిదాల పద్ధతిలో రివీల్ చేసేంత సమయం లేదు. ఎందుకంటే ఈ సినిమాను 28 రోజులలోనే పూర్తి చేశారు. ఇది ఈ సినిమా టీమ్ చెప్పిన మాటనే. ఈ సినిమా కోసం సుహాస్ 20 రోజులు .. కుర్తి సురేశ్ 18 రోజలు మాత్రమే కేటాయించారట. పక్కా ప్లానింగ్ తో పూర్తి చేశాం .. అవుట్ పుట్ గురించిన డౌటే అవసరం లేదంటుంది టీమ్.
ఈ సినిమాను నేరుగా 'అమెజాన్ ప్రైమ్' లో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలు కానుంది. రాధిక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి, ఐవీ శశి దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది చూడాలి మరి.