శాశ్వతంగా గుర్తుండిపోయేలా దెబ్బకొడతాం.. అమెరికాకు ఇరాన్ మంత్రి వార్నింగ్
--
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా ఇలా నేరపూరితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇటువంటి నేరపూరిత ప్రవర్తన ఉన్న అగ్రరాజ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐరాసలోని సభ్యులకు అబ్బాస్ సూచించారు. యూఎన్ చార్టర్ ప్రకారం.. ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటూ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. అమెరికా ప్రవర్తనను ఖడించాలని ప్రపంచ దేశాలకు అబ్బాస్ పిలుపునిచ్చారు.