లండన్ లో బోయ్ ఫ్రెండ్ తో కలిసి కెమెరాకు చిక్కిన జాన్వీ కపూర్!
- బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో లండన్‌లో జాన్వీ కపూర్
- వీరిద్దరూ వీధుల్లో తిరుగుతుండగా వీడియో తీసిన ఫ్యాన్స్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లండన్ వీడియో
ప్రస్తుతం వీరిద్దరూ లండన్ వీధుల్లో కలిసి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఎవరో అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ప్రైవసీ కోసం లండన్ వెళ్లినా, అభిమానుల కంటపడకుండా జాన్వీ తప్పించుకోలేకపోయారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే, జాన్వీ కపూర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ప్రతిష్ఠాత్మక చిత్రం 'పెద్ది'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, జాన్వీ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.