నాగచైతన్యతో కలిసి ప్రమోషన్స్ గురించి క్లారిటీ ఇచ్చిన సమంత
- వచ్చే నెల రీ-రిలీజ్ అవుతున్న 'ఏం మాయ చేసావే'
- ఈ చిత్రంలో జంటగా నటించిన సమంత, నాగచైతన్య
- ప్రమోషన్స్ కు తాను దూరంగా ఉన్నానన్న సమంత
"చిత్రబృందంతో కలిసి నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడం లేదు. నిజం చెప్పాలంటే ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటున్నా. ఇలాంటి వార్తలు ఎవరు కల్పిస్తున్నారో నాకు తెలియడం లేదు" అని సమంత తెలిపారు. ప్రేక్షకుల దృష్టికోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు.
అనంతరం తన తొలి సినిమా రోజుల అనుభవాలను గుర్తుచేసుకుంటూ, "'మాస్కోవిన్ కావేరి' నా మొదటి సినిమా అయినా, 'ఏ మాయ చేసావె' షూటింగ్‌కు సంబంధించిన ప్రతి విషయం నాకు బాగా గుర్తుంది. జెస్సీ-కార్తీక్‌ల ఇంటి గేటు సీన్ నా తొలి షాట్. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో పనిచేయడం అప్పట్లో ఎంతో సంతోషాన్నిచ్చింది" అని సమంత వివరించారు. నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా సమంత ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్నారు.