అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
- ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనియా గాంధీ
- ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ
- ఆసుపత్రిలోని గ్యాస్ట్రో విభాగంలో సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్న వైద్యులు
సోనియా గాంధీ ఇదే ఆసుపత్రిలో ఈ నెల 9న చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దానికి రెండు రోజుల ముందు ఆమె సిమ్లాలోని ఇందిరా గాంధీ వైద్య కళాశాల ఆసుపత్రి (ఐజీఎంసీ)లో చేరిన విషయం విదితమే. అధిక రక్తపోటుతో బాధపడిన సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు.