ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
--
2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నోడల్ అధికారి ఫిర్యాదు చేయగా కమాలపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే, ఈ కేసును కొట్టివేయాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. కేసును కొట్టివేయలేమని పేర్కొంటూ పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ ను తోసిపుచ్చింది.