జూన్ 6న విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ‘ఢీ’ రీ రిలీజ్
- 2007లో వచ్చిన ఢీ
- మంచు విష్ణు, జెనీలియా జంటగా బ్లాక్ బస్టర్ మూవీ
- శ్రీను వైట్ల దర్శకత్వంలో చిత్రం
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విష్ణు నుంచి వచ్చిన ఈ కామెడీ బ్లాక్ బస్టర్ సినిమాను మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ వారంలో థియేటర్లోకి ఢీ మూవీని మళ్లీ అందించబోతోన్నారు. అసలే ఇప్పుడు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో ఉన్నారు. విష్ణు ఈ కన్నప్ప చిత్రంతో సందడి చేసే కంటే ముందే మళ్లీ ‘ఢీ’తో మరోసారి అందరినీ పలకరించనున్నారు. ‘కన్నప్ప’ చిత్రాన్ని జూన్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.