లండన్ లో రామ్ చరణ్ మేనియా... ఫొటోలు ఇవిగో!
లండన్ లో రామ్ చరణ్ మేనియా కొట్టొచ్చినట్టు కనపడింది. ఆఖరికి చరణ్ పెంపుడు శునకం రైమ్ కు కూడా అభిమానులు ఏర్పడ్డారంటే అతిశయోక్తి కాదు. రైమ్ పేరిట ప్లకార్డులు పట్టుకున్న అభిమానులు లండన్ లో సందడి చేశారు. ఇక, అభిమానులను నిరాశపరచకుండా రామ్ చరణ్ కారు సన్ రూఫ్ నుంచి అందరికీ అభివాదం చేసి ఆనందం కలిగించారు. ఫ్యాన్స్ సంగీత వాద్యాలతో లండన్ వీధులను హోరెత్తించారు.







