ఆపరేషన్ సిందూర్ గురించి జైశంకర్ అమెరికాకు ముందే హింట్ ఇచ్చారా..?
- పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న కేంద్రమంత్రి
- పాకిస్థాన్ లోని ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తామని వెల్లడి
- అమెరికా విదేశాంగ కార్యదర్శికి వారం ముందే స్పష్టం చేసినట్లు వివరణ
ఉగ్రదాడికి ప్రతిగా భారత్ మే 7న "ఆపరేషన్ సిందూర్" చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడుల లక్ష్యం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమేనని, పాకిస్థాన్ సైనిక స్థావరాలు గానీ, పౌరులు గానీ లక్ష్యం కాదని స్పష్టం చేసింది.
భారత దాడుల అనంతరం పాకిస్థాన్ డ్రోన్లు, ఇతర ఆయుధాలతో ప్రతిదాడులకు యత్నించగా, భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని, ఇస్లామాబాద్ దుందుడుకు చర్యలకు తగిన రీతిలో సమాధానం చెప్పాయని అధికార వర్గాలు తెలిపాయి. మే 9, 10 తేదీల్లో భారత వైమానిక దాడులు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయని, అవి "నిప్పుల వర్షం" కురిపించాయని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్ వైఖరిలో ఇదొక నూతన అధ్యాయమని పేర్కొన్నాయి.