శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన వేళలు మార్పు
ప్రొటోకాల్, రిఫరెల్, జనరల్ బ్రేక్ దర్శనాలను 7.30లోపు పూర్తి చే సి.. ఆ తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ప్రణాళిక రచించింది. ఉదయం 5.45: ప్రొటోకాల్ దర్శనం, 6.30: రిఫరెల్ ప్రొటోకాల్, 6.45: జనరల్ బ్రేక్, 10.15: శ్రీవాణి(ఆన్‌లైన్, ఆఫ్‌లైన్), 10.30: దాతలు, 11.00: టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు.. గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.