గ్రూప్-1 వ్యవహారంపై టీజీపీఎస్సీ చైర్మన్‌కు బండి సంజయ్ లేఖ
- వారం రోజుల్లోగా సమగ్ర సమాచారం ఇవ్వాలని చైర్మన్‌కు విజ్ఞప్తి
- పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థుల ఆందోళన
- తమ సందేహాలు నివృత్తి చేయాలని బండి సంజయ్‌ను కోరిన పలువురు అభ్యర్థులు
- అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు స్పందించిన బండి సంజయ్
గ్రూప్-1 పరీక్షల విషయంలో తమకు అనేక సందేహాలున్నాయని, అవినీతి, అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు అభ్యర్థులు ఇటీవల బండి సంజయ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న బండి సంజయ్, ఈ మేరకు టీజీపీఎస్సీకి లేఖ రాశారు. అభ్యర్థులు లేవనెత్తిన ప్రధాన సందేహాలను, ఆరోపణలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను వారం రోజుల్లోగా అందజేయాలని టీజీపీఎస్సీ చైర్మన్‌ను కోరారు.