’హిందువులను రక్షిస్తే తల తీసేస్తాం..‘ అంటూ సైనికుడి ఇంటిముందు బెదిరింపు పోస్టర్
- బెంగాల్ జవాన్ గౌరవ్ ముఖర్జీ ఫ్యామిలీకి దుండగుల హెచ్చరిక
- ప్రస్తుతం కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న పారా కమాండో గౌరవ్
- సైనికుడి ఇంటికి 24 గంటల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. హుగ్లీ గ్రామీణ పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. గౌరవ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటి బయట నిఘా కెమెరాలు అమర్చడంతో పాటు, పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నారు.
గౌరవ్ ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. పోస్టర్ అతికించిన సమయంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు రెండు స్కూటర్లపై అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. ప్రాథమికంగా ఇది స్థానిక దుండగుల పనే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నామని, అయితే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సైనికుడి కుటుంబానికి బెదిరింపులు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.