పహల్గామ్ దాడిలో పాక్ పాత్ర కన్ఫర్మ్.. ఉగ్రవాదుల్లో ఒకరు పాక్ సైనికుడే..!
- హషిమ్ మూసాను పాక్ పారా కమాండోగా గుర్తించిన అధికారులు
- ప్రస్తుతం లష్కరే తోయిబాతో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలు
- మరోసారి బయటపడ్డ ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య సంబంధం
పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి హషీమ్ మూసా లష్కరేలోకి సహాయకుడిగా వచ్చినట్లు తెలుస్తోందని ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధానికి ఇదే నిదర్శనమని చెప్పారు. పారా కమాండోలకు పాకిస్థాన్ అత్యాధునిక శిక్షణ ఇస్తోందని, కోవర్ట్ ఆపరేషన్లలో తీర్చిదిద్దుతోందని ఆరోపించారు. అత్యాధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ అందిస్తోందని తెలిపారు.