సీఐడీ కస్టడీకి పీఎస్ఆర్ ఆంజనేయులు
అనంతరం కస్టడీలోకి తీసుకున్న అధికారులు తాడిగడపలోని సీఐడీ కార్యాలయంలో ఆయనను విచారిస్తున్నారు. ఇక, మూడు రోజుల పాటు (ఆది, సోమ, మంగళవారం) ఆయన్ను సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఇటీవల విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా, ముంబయి నటి కాదంబరి జెత్వానీపై అక్రమంగా కేసు బనాయించారనే ఆరోపణలతో పీఎస్ఆర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు.