ప్రయాణికురాలిపై బస్సు కండక్టర్ అసభ్య ప్రవర్తన .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
- మహిళా ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- కండక్టర్ ప్రదీప్ ను అరెస్టు చేసి జైలుకు తరలించిన పోలీసులు
- విధుల నుంచి సస్పెండ్ చేసిన కెఎస్ఆర్టీసీ అధికారులు
కర్ణాటక రాష్ట్రం మంగళూరులో ఈ ఘటన జరిగింది. ముడిపు నుంచి మంగళూరు నగరానికి వస్తున్న బస్సులో కండక్టర్ ఈ నీచపు పనికి పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో బస్సు కండక్టర్ ప్రదీప్ కశప్ప నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియో ఆధారంగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద ప్రదీప్‌పై కేసు నమోదు చేశారు.
నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంపై కెఎస్ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రదీప్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా స్పందించారు. విచారణ త్వరగా పూర్తి చేసి సంబంధిత కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కెఎస్ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు.