పహల్గామ్ దాడి తర్వాత మరో ఉగ్ర కుట్ర.. సరిహద్దుల్లో కాల్పులు
- భారీ ఆయుధాలతో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు
- ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపి అడ్డుకున్న భద్రతా బలగాలు
- ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
వారి కదలికలను గుర్తించి అప్రమత్తమైన సైనిక బృందాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది. చనిపోయిన ఉగ్రవాదుల నుంచి భారీ పరిమాణంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించడం, పలువురు గాయపడటం తెలిసిందే. ఈ ఘోరం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే చొరబాటు యత్నం జరగడం గమనార్హం.