సిక్సర్ తో ఐపీఎల్ అరంగేట్రం.. అయినా కన్నీళ్లతో మైదానం వీడిన వైభవ్.. వీడియో ఇదిగో!
- రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ లోకి ఎంట్రీ
- 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు
- కీలక సమయంలో ఔటై తీవ్ర భావోద్వేగానికి లోనైన వైభవ్
పదిహేను ఓవర్లలోనే మ్యాచ్ ను ముగిస్తారని అభిమానులు భావించేలా చేశారు. మరికొద్దిసేపు క్రీజులో ఉండి ఉంటే అలవోకగా అర్ధ శతకం బాదేసేవాడే. దురదృష్టవశాత్తూ స్టంపౌట్ తో వైభవ్ వెనుదిరగాల్సి వచ్చింది. ఐడెన్ మార్క్‌రమ్ బౌలింగ్‌లో వైభవ్ ఔటయ్యాడు. పెవిలియన్ చేరే సమయంలో అతను తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు కనిపించడం అందరినీ కదిలించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.