ఆరోజు మిగిలేది రేవంత్ రెడ్డి, ఆయన అసిస్టెంట్లు మాత్రమే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ఏప్రిల్ 27న వరంగల్ లో బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ సభ
- ఆ రోజు యావత్ తెలంగాణ వరంగల్ లో ఉంటుందన్న ప్రవీణ్ కుమార్
- గాంధీ భవన్ లో లైవ్ చూస్తూ కాలక్షేపం చేయాలని ఎద్దేవా
"కాంగీ కాకుల్లారా, మీరెన్ని కుట్రలు చేసినా ఏప్రిల్ 27న యావత్ తెలంగాణ వరంగల్ లో ఉండబోతోంది. ఆరోజు మిగిలేది కేవలం రేవంత్ రెడ్డి ఆయన అసిస్టెంట్లు మాత్రమే. గాంధీ భవన్ లో మా సభ లైవ్ చూస్తూ చక్కగా కాలక్షేపం చేసుకోండి" అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.