ఎట్టకేలకు ప్రారంభమైన మ్యాచ్... ఆర్సీబీ విలవిల
అయితే, పిచ్ పై తేమ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న పంజాబ్ బౌలర్లు చెలరేగిపోయారు. దాంతో ఆర్సీబీ 42 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 9 ఓవర్లలో 7 వికెట్లకు 43 పరుగులు. క్రీజులో టిమ్ డేవిడ్ (6 బ్యాటింగ్), భువనేశ్వర్ కుమార్ (1 బ్యాటింగ్) ఉన్నారు.
పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, మార్కో యన్సెన్ 2, చహల్ 2, బార్లెట్ 1 వికెట్ తీశారు.