'రోహిత్ వేముల' చట్టాన్ని రూపొందించి అమలు చేయండి: కర్ణాటక ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ లేఖ
- విద్యా వ్యవస్థలో దళిత, ఆదివాసీ వర్గాల విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నారన్న రాహుల్ గాంధీ
- అంబేడ్కర్ ఎదుర్కొన్న కష్టం మరే బిడ్డా ఎదుర్కోకూడదన్న రాహుల్ గాంధీ
- ఇలాంటి హత్యలకు ఇకనైనా ముగింపు పలకాలన్న రాహుల్ గాంధీ
అంబేద్కర్ ఎదుర్కొన్న కష్టాన్ని మరే బిడ్డా ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధరామయ్య కృషి చేస్తారని తాను విశ్వసిస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు. కొందరు వ్యక్తులు చూపిన వివక్ష కారణంగా ఎంతో భవిష్యత్తు ఉన్న రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి యువత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి విషాదకర ఘటనలకు ఇకనైనా ముగింపు పలకాలని ఆ లేఖలో రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.