మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్న పవన్.. వీడియో ఇదిగో!
అక్కడి ఆసుపత్రిలో చికిత్స అనంతరం మార్క్ శంకర్ కోలుకోవడంతో అతడితో కలిసి హైదరాబాద్ పయనమయ్యారు. ఈ ఉదయం భార్య అన్నాలెజినోవా, మార్క్ శంకర్‌తో కలిసి పవన్ శంషాబాద్ చేరుకున్నారు. కుమారుడిని ఎత్తుకుని విమానాశ్రయం నుంచి పవన్ బయటకు వస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.