టీడీపీ నేతపై కత్తితో దాడి చేసిన వైసీపీ నేత
- పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఘటన
- టీడీపీ నేత హరినాథ్ పై వైసీపీ నేత వేణుగోపాల్ కత్తితో దాడి
- పొలానికి దారి విషయంలో కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదం
ఈ దాడిలో హరినాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. పొలానికి దారి విషయంలో వీరి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ విషయాన్ని వారు పోలీసులు దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే హరినాథ్ పై దాడి జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.