పులి అన్నావ్, తొడగొట్టావ్.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లావు? కాకాణిపై సోమిరెడ్డి సెటైర్
- ఎక్కడికీ పారిపోలేదంటున్నావ్ మరి ఎక్కడా కనిపించవేం?
- పోలీసుల విచారణకు హాజరు కావడంలేదేమని నిలదీత
- ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ వంశీ ఉంటాడు.. పలకరించు అంటూ ఎద్దేవా
‘ఎక్కడికీ పారిపోనని చెప్పావ్ మరి ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదేం? పులిని అన్నావ్, తొడ కొట్టావ్.. ఇప్పుడు ఎక్కడికి పోయావు? పోలీసుల విచారణకు ఎందుకు హాజరుకావడంలేదు?’ అని ప్రశ్నించారు. పోలీసులు విచారణకు పిలిస్తే కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. విచారణకు హాజరుకావచ్చు కదా అని సలహా ఇచ్చారు. ‘ఒకవేళ నువ్వు జైలుకు వెళ్తే అక్కడ నీ స్నేహితుడు వల్లభనేని వంశీ ఉంటాడు, పలకరించు’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి వ్యంగ్యంగా అన్నారు.