వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. ఐటీడీపీ కార్యకర్తపై టీడీపీ వేటు
--
మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. అంతేకాదు, చేబ్రోలు కిరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలను అధిష్ఠానం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పార్టీ నేతలు ఫిర్యాదు చేయగా.. చేబ్రోలు కిరణ్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.