పవన్ కుమారుడికి ప్రమాదం... వైఎస్ జగన్ ఏమన్నారంటే..!
"సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అందులో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతోనే ఉంటాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని జగన్ ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు.
ఇక ఇప్పటికే ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్, మాజీ మంత్రి కేటీఆర్, చిరంజీవి తదితరులు స్పందించారు. పవన్ కుమారుడు గాయపడడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.