'పెద్ది' నుంచి క్రేజీ అప్‌డేట్
- రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో పెద్ది
- ఎల్లుండి శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ విడుదల
- ఏఆర్ రెహమాన్ ఈ గ్లింప్స్ తాలూకు మిక్సింగ్‌ను పూర్తి చేసినట్లు వెల్లడి
'ఫస్ట్ షాట్' పేరుతో పెద్ది గ్లింప్స్ ను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు ఈ గ్లింప్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారికి తాజాగా మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ గ్లింప్స్ తాలూకు మిక్సింగ్‌ను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎల్లుండి (ఆదివారం) ఉదయం 11.45 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.