వక్ఫ్ సవరణ చర్చ.. దేవెగౌడపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రశంసలు
- 17 గంటల పాటు సాగిన చర్చలో దేవెగౌడ ఉత్సాహంగా పాల్గొన్నారన్న తేజస్వీ సూర్య
- ఇది అందరికీ స్ఫూర్తిదాయకమన్న బీజేపీ ఎంపీ
- సమావేశాలకు అంతరాయం కలిగించేవారు దేవెగౌడను చూసి నేర్చుకోవాలన్న ఎంపీ
ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో దేవెగౌడ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తేజస్వీ సూర్య స్పందిస్తూ, ప్రజల సమస్యలను వినిపించడానికి వారి తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకునే వారు ఉన్నారని అన్నారు. సమావేశాలకు అంతరాయం కలిగించేవారు, గందరగోళం సృష్టించేవారు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారంతా దేవెగౌడను చూసి సభలో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలని సూచించారు.