'హిట్-3' నుంచి కొత్త పోస్టర్... ఊరమాస్ లుక్‌లో కిర్రాక్‌గా నాని
- నాని, శైలేశ్ కొలను కాంబోలో 'హిట్: ది థర్డ్ కేస్'
- ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన నేచురల్ స్టార్
- చేతిలో స్టైలిష్‌గా గన్ పట్టుకుని సిగరెట్ కాలుస్తూ ఊరమాస్ లుక్‌లో నాని దర్శనం
ఇక ఈ సినిమాలో శైలేశ్ కొలను హీరో నానిని విభిన్నంగా చూపించబోతున్నారు. ఇప్పటికే కశ్మీర్ ప్రాంతంలో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. నాని సొంత బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమాతో కలిసి యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.