'రాజీవ్ యువ వికాసం పథకం' దరఖాస్తుల గడువు పొడిగింపు
- ఏప్రిల్ 14వ తేదీ వరకు గడువు పొడిగింపు
- ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భట్టివిక్రమార్క ఆదేశం
- వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, పలువురు కలెక్టర్లు
ఈ పథకం అమలు తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు కలెక్టర్లు పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ-1 కింద రూ. 1 లక్ష, కేటగిరీ-2 కింద రూ. 2 లక్షలు, కేటగిరీ-3 కింద రూ. 3 లక్షల రుణాలను అందజేయనుండగా, వరుసగా 80 శాతం, 70 శాతం, 60 శాతం రాయితీ లభిస్తుంది.