ఒక్క పోస్టర్ తో ఎక్కడికో తీసుకెళ్లిన 'పెద్ది'... ఎనర్జటిక్ గా రామ్ చరణ్
- రామ్ చరణ్ హీరోగా పెద్ది
- బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చిత్రం
- ఏప్రిల్ 6న గ్లింప్స్ విడుదల
- నేడు పోస్టర్ తో అనౌన్స్ మెంట్ చేసిన మేకర్స్
తాజాగా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని, అంచనాలను మరో మెట్టుకు తీసుకెళ్లేలా పెద్ది సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ‘ఫస్ట్ షాట్’ పేరుతో ‘పెద్ది’ చిత్రం నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6న ఈ గ్లింప్స్‌ను విడుదలవుతుంది. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో క్రీడా మైదానంలోకి డైనమిక్‌గా దూకుతోన్న రామ్ చరణ్‌ను చూడొచ్చు. ఈ పోస్టర్‌తో గ్లింప్స్ ఎలా ఉండబోతుందోనని అందరిలో ఆసక్తి మరింత పెరిగింది.
‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. కన్నడ సూపర్‌స్టార్ కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్, వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు, బాలీవుడ్ విలక్షణ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత స్వరకర్త ఎఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆర్. రత్నవేలు ఐఎస్‌సి అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను అందిస్తామని మేకర్స్ పేర్కొన్నారు.
