పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. సెల్‌ఫోన్ వెలుగు కాపాడింది!
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘటన
- క్రికెట్ బెట్టింగ్‌లో రూ. 3 లక్షలు నష్టపోయిన యువకుడు
- అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యకు యత్నం
- పట్టాలపై పడుకుని చివరిసారి సోదరికి ఫోన్
- ఫోన్ వెలుగును గుర్తించి రక్షించిన పోలీసులు
గురువారం రాత్రి 10 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. స్టేషన్ శివారుకు వెళ్లి పట్టాలపై పడుకున్నాడు. అయితే, సోదరి గుర్తు రావడంతో ఆమెకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. క్రికెట్ బెట్టింగ్ కోసం స్నేహితుల వద్ద అప్పులు చేసినట్టు చెప్పాడు. ఆ డబ్బులు తాను చెల్లిస్తానని, ఇంటికి రావాలని ఆమె కోరింది. ఈ క్రమంలో వారి మధ్య ఫోన్ సంభాషణ జరుగుతోంది.
అదే సమయంలో సికింద్రాబాద్ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫాం చివరలో జీఆర్పీ కానిస్టేబుల్ సైదులు, ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సురేశ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో పట్టాలపై సెల్‌ఫోన్ వెలుగు కనిపించడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడకు వెళ్లి చూడగా పట్టాలపై పడుకొని ఫోన్ మాట్లాడుతున్న యువకుడు కనిపించాడు. అతడిని పట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించారు.