ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ మరోసారి సీరియస్!
- ఆది నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కొలికపూడి శ్రీనివాసరావు
- నివేదిక కోరిన టీడీపీ హైకమాండ్
- ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్తలతో త్రిసభ్య కమిటీ
- 10 నెలలుగా నియోజకవర్గంలో ఏం జరుగుతోందో నివేదిక అందించాలని ఆదేశం
అందరినీ కలుపుకొని పోవాలని, పార్టీ వేదికలపైనే సమస్యలను చర్చించాలని అధిష్ఠానం పలుమార్లు సూచించినప్పటికీ కొలికపూడి తన వైఖరిని మార్చుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నేత రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని కొలికపూడి చేసిన ప్రకటన మరింత వివాదాస్పదమైంది. ఇలా బాహాటంగా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పినా, కొలికపూడి వినిపించుకోకపోవడం పార్టీ అధిష్ఠానాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
కొలికపూడి శ్రీనివాస్ ధిక్కార స్వరం విమర్శలకు తావిస్తోందని, ఇది పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. ఆయన తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.