'రాబిన్ హుడ్' సినిమా... డేవిడ్ వార్నర్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్
- నితిన్ సినిమా 'రాబిన్ హుడ్'లో నటించిన డేవిడ్ వార్నర్
- మూడు నిమిషాల సేపు ఉన్న వార్నర్ పాత్ర
- రూ. 2.5 కోట్ల పారితోషికం అందుకున్నట్టు సమాచారం
మరోవైపు, ఈ సినిమాకు వార్నర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో వార్నర్ పాత్ర కేవలం మూడు నిమిషాల పాటే ఉంటుందట. ఇంత తక్కువ సమయానికి కూడా వార్నర్ కు భారీగానే ముట్టచెప్పారట. ఈ సినిమాకు వార్నర్ రూ. 2.5 కోట్లు తీసుకున్నాడని సమాచారం. వార్నర్ రెండు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడట. అంటే రోజుకు రూ. 1.25 కోట్లు తీసుకున్నాడన్నమాట. స్టార్ హీరోలు కూడా ఒక రోజుకు ఇంత తీసుకోరేమో. ఈ సినిమా ప్రమోషన్లలో కూడా వార్నర్ పాల్గొంటున్నాడు.