ఐశ్వర్య రాయ్ కారుకు ప్రమాదం
- ప్రమాదానికి గురైన ఐశ్వర్య రాయ్ కారు
- ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు
- కారు ప్రమాదంపై సోషల్ మీడియాలో వీడియో వైరల్
- పెద్ద ప్రమాదమేమీ జరగలేదని స్థానిక మీడియాకు వెల్లడించిన ఐశ్వర్య రాయ్ టీమ్
ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పలువురు అభిమానులు ఐశ్వర్యకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఆమె కారులో లేరని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సోషల్ మీడియాలో కారు ప్రమాదానికి సంబంధించిన వార్త వైరల్ కావడంతో ఐశ్వర్యా రాయ్ టీమ్ స్పందించింది. ఇది పెద్ద ప్రమాదం కాదని స్థానిక మీడియాకు ఆమె టీమ్ తెలియజేసినట్లు సమాచారం.