'ఆర్‌సీ 16' నుంచి అదిరిపోయే అప్‌డేట్.. రేపు చెర్రీ బర్త్‌డే ట్రీట్!
- రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో 'ఆర్‌సీ 16'
- రేపు చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్
- సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన మేకర్స్
ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.