అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ
- కన్నప్పకు పోటీగా భైరవం విడుదల
- వెండితెరపైనే చూసుకుందామన్న మనోజ్
- ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతున్న విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’
కొంతకాలంగా అన్నదమ్ములు మౌనంగా ఉండడంతో గొడవ సమసిపోయిందని అంతా అనుకున్నారు. ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మనోజ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన పోస్టు పెట్టడంతో మంచు కుటుంబం కలిసిపోతుందని అభిమానులు ఆశించారు. అయితే, మంచు కుటుంబ వివాదానికి సంబంధించిన వేడి ఇప్పుడు వెండితెరకు తాకింది. అన్నదమ్ములు పోటీగా సినిమాలు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. మంచు మనోజ్ కూడా తన తాజా సినిమా ‘భైరవం’ను అదే సమయంలో విడుదల చేస్తానని తాజాగా ప్రకటించారు. వెండితెరపైనే తేల్చుకుందామని అన్నకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మంచు మనోజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.