చరణ్ కి నచ్చని టైటిల్?
- షూటింగు దశలో చరణ్ 16వ సినిమా
- పరిశీలనలో 'పెద్ది' టైటిల్
- అసంతృప్తిని వ్యక్తం చేసిన చరణ్
- ఆలోచనలో పడిన టీమ్
- వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమా కథ రాసుకునేటప్పుడే బుచ్చిబాబు 'పెద్ది' అనే టైటిల్ ను అనుకున్నాడు. ఈ టైటిల్ కి అభిమానుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో చరణ్ అసంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు. ఈ టైటిల్ పట్ల ఆయన అయిష్టతను వ్యక్తం చేశాడనే ప్రచారం బలంగానే జరుగుతోంది. దాంతో టైటిల్ పై టీమ్ గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టుగా టాక్.
ఈ నెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు. అందువలన ఆ రోజున టైటిల్ పోస్టర్ ని వదలొచ్చని అభిమానులు అనుకున్నారు. కానీ ఇప్పుడు టైటిల్ లేకుండానే ఫస్టు లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ .. జగపతిబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.