విష్ణుప్రియ సహా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు
- బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసుల నజర్
- ఇప్పటికే పలువురు యూట్యూబర్లపై కేసులు
- తాజాగా విష్ణుప్రియ, టేస్టీ తేజ సహా పలువురు సెలబ్రిటీలకు నోటీసులు
బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా పదకొండు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన మరికొందరిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.