'కన్నప్ప'ను నడిపించింది కచ్చితంగా శివలీలనే: మంచు విష్ణు
- భారీ బడ్జెట్ తో నిర్మితమైన 'కన్నప్ప'
- సీనియర్ స్టార్స్ కారణంగా పెరిగిన క్రేజ్
- ప్రభాస్ చేసిన పాత్ర ఆయన ఎంచుకున్నదే అని వెల్లడి
- ఏప్రిల్ 25న విడుదల కానున్న సినిమా
"ఈ సినిమా పరిధి పెరుగుతూ వెళ్లడం వలన నా ఒక్కడి బలం సరిపోదని అనిపించింది. అందువల్లనే అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ గారి లాంటి వారిని తీసుకోవడం జరిగింది. అందరూ కూడా నాన్నగారి పట్ల గల గౌరవంతోనే ఈ సినిమాను చేశారు. ప్రభాస్ గారు శివుడిగా కనిపిస్తారనే అంతా అనుకున్నారు. కానీ ప్రభాస్ గారు చేసిన పాత్ర ఆయన ఎంచుకున్నదే" అని చెప్పారు.
"ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర చూసి అంతా షాక్ అవుతారు. అంతగా ఆ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది. నేను పాన్ ఇండియా సినిమా చేయాలి... భారీ వసూళ్లు రాబట్టాలి అనే ఆలోచనతో ఈ సినిమా చేయలేదు. 'కన్నప్ప' కథ పట్ల ప్రేమతో చేశాను. ఈ సినిమా కోసం ఇంతమంది అతిరథమహారథులు పని చేయడం చూస్తే, ఇది కచ్చితంగా శివలీలనే అనిపించింది. ఆయన అనుగ్రహంతోనే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగాము" అని అన్నారు.