రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
- కేసీఆర్ పద్నాలుగేళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించారన్న ప్రశాంత్ రెడ్డి
- రేవంత్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడారని ఆగ్రహం
- కేసీఆర్ మీద అక్కసుతో ఛాంబర్ కూడా కేటాయించలేదని ఆరోపణ
కేసీఆర్ మీద అక్కసుతో ఆయనకు ఛాంబర్ కూడా కేటాయించలేదని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు సూచించిన వారికి పీఏసీ చైర్మన్ పదవిని ఇవ్వాలని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనవాయతీని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను సంప్రదించకుండానే పీఏసీ చైర్మన్‌ను నియమించారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ప్రతిపక్ష నేతకూ అంతే ప్రాధాన్యత ఉంటుంది వ్యాఖ్యానించారు.