విష్ణు షేర్ చేసిన 'కన్నప్ప' మేకింగ్ వీడియో ఇదిగో!
- మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప
- ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఎపిక్ మూవీ
- ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన కన్నప్ప టీమ్
తాజాగా, మంచు విష్ణు కన్నప్ప మేకింగ్ వీడియో పంచుకున్నారు. తాము ఈ సినిమా కోసం ఎంత అధ్యయనం చేశామో, ఎన్ని డిస్కషన్లు జరిపామో, ఎంత హార్డ్ వర్క్ చేశామో ఈ వీడియో ద్వారా విష్ణు వివరించారు. దర్శకుడితో కలిసి తాను 24 క్రాఫ్ట్స్ తో ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లిందీ ఈ వీడియో ద్వారా వెల్లడించారు.
కన్నప్ప చిత్రం అవా ఎంటర్టయిన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బానర్లపై మహాభారత్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది.