ఎల్లుండి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. సునీల్ గవాస్కర్ సూచనలు
- గత రెండు మ్యాచ్‌లలో నలుగురు స్పిన్నర్లతో ఆడినట్లుగానే బరిలోకి దిగాలన్న గవాస్కర్
- ఓపెనర్ల నుండి భారీ ఆరంభం దక్కాలన్న గవాస్కర్
- కొన్ని అంశాల్లో మెరుగైతే పైనల్లో తిరుగు ఉండదని సూచన
ఓపెనర్ల నుండి ఇప్పటి వరకు భారీ ఆరంభం దక్కలేదని, ఫైనల్లో వారి నుండి మంచి ప్రదర్శన ఉంటుందని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కొత్త బంతితో ఆరంభంలో కొన్ని వికెట్లు తీయాలని, కనీసం రెండు నుండి మూడు వికెట్లు తీస్తే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రిస్తున్నప్పటికీ, వికెట్లు తీస్తేనే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించారు.
చక్రవర్తి, కుల్దీప్‌లను జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయమని సునీల్ గవాస్కర్ అన్నారు. పరిమిత ఓవర్లలో డాట్ బాల్స్‌ను వేయడం కీలకమని, ఈ విషయంలో వారిద్దరు మంచి ప్రదర్శన చేస్తున్నారని ప్రశంసించారు. దుబాయ్ పిచ్ నుండి మంచి సహకారం అందుతోందని వ్యాఖ్యానించారు.