వెబ్ సిరీస్ లో మాజీ క్రికెటర్ అతిథి పాత్ర!
- సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న గంగూలీ పిక్చర్
- ఈ నెల 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘ఖాకీ’ స్ట్రీమింగ్
- ఐపీఎస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా నిర్మాణం
‘ఖాకీ ది బిహార్ చాప్టర్’కు కొనసాగింపుగా జీత్, ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ ప్రధాన పాత్రల్లో ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2) సిరీస్ ను తెరకెక్కించినట్లు పాండే తెలిపారు. బుధవారం జరిగిన ఈ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ..ఐపీఎస్ అధికారి అమిత్ లోథా తన వృత్తి జీవితంలో ఎదురైన సంఘటనలను ‘బిహార్ డైరీస్’ పేరుతో అక్షరీకరించారు. దీని ఆధారంగా ‘బిహార్ చాప్టర్’ను తెరకెక్కించినట్లు నీరజ్ పాండే వివరించారు. 2022లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయగా ప్రేక్షకాదరణ పొందిందని తెలిపారు. ఈ సిరీస్ కు కొనసాగింపుగా తాజాగా ఖాకీ 2 రూపొందించినట్లు వివరించారు.