విజయ్ దేవరకొండ సినిమా టైటిల్‌ను లీక్ చేసిన 'దిల్' రాజు
- విజయ్ కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన 'దిల్'రాజు
- 'రౌడీ జనార్దన్ 'గా ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ దేవరకొండ
- ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభ కానుందని తెలిపిన నిర్మాత
ఈ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో పాటు 'రాజు వారు... రాణి గారు' చిత్ర దర్శకుడు రవికిరణ్ కొల్లా దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని అంగీకరించాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 'దిల్' రాజు నిర్మిస్తారు.
కాగా బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత రాజు ఈ చిత్రం టైటిల్‌ను లీక్ చేశాడు. తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చెబుతూ ఆ వరుసలోనే విజయ్ దేవరకొండ చిత్రానికి 'రౌడీ జనార్దన్' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని, దీంతో పాటు నితిన్ హీరోగా 'బలగం' వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' అనే చిత్రాన్ని తమ సంస్థలో నిర్మిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు.