అప్పుడు అలా అనుకున్నా.. దర్శకులపై ప్రశాంత్ నీల్ కీలక వ్యాఖ్యలు!
- కెరీర్ తొలినాళ్లలో సినీ పరిశ్రమపై తన అభిప్రాయం ఎలా ఉండేదో చెప్పిన ప్రశాంత్ నీల్
- తాజాగా నటి అమలతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు
- ఈ సందర్భంగా పలు కీలక విషయాలను పంచుకున్న డైరెక్టర్
"సినిమా చూడటం అనేది తేలికైన పని. కానీ, తెరకెక్కించడం చాలా కష్టం. 2014లో నేను తీసిన తొలి మూవీ 'ఉగ్రం'. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకాక ముందు... 'ఇప్పటివరకూ సినిమాలు తెరకెక్కించిన వారంతా బ్యాడ్ డైరెక్టర్స్ (నవ్వుతూ). చిత్ర పరిశ్రమలో మనమే మార్పు తీసుకురావాలి' అని అనుకునేవాడిని. కానీ, మూవీ చిత్రీకరణ కొంత భాగం పూర్తయ్యాక అసలు విషయం అర్థమైంది.
ఈ సినిమా 10 మంది వీక్షించినా చాలు అనిపించింది. మూవీ నిర్మాణానికి టీమ్ వర్క్ చాలా అవసరమని, అప్పుడే విజయం సాధించగలమని గ్రహించాను. అందుకే ఫిల్మ్ మేకింగ్ అనేది టెన్నిస్‌లాంటిది కాదు, క్రికెట్‌లాంటిది. జట్టుగా పనిచేయాల్సి ఉంటుంది" అని ప్రశాంత్ నీల్ అన్నారు.