వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం
- సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను పోలీసులకు అందజేసిన కోర్టు
- పోలీసు కస్టడీకి ఏ4 వీర్రాజు, ఏ10 వంశీ బాబు
- తనను వేరే బ్యారక్ కు మార్చాలన్న వంశీ పిటిషన్ పై ఈ రోజు తీర్పును వెలువరించే అవకాశం
కేసు దర్యాప్తులో భాగంగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ కావాలని కోరుతూ పోలీసులు కోర్టును కోరారు. వారి విన్నపం మేరకు కోర్టు స్టేట్మెంట్ ను అందజేసింది. మరోవైపు, ఈ కేసులో ఏ4 వీర్రాజు, ఏ10 వంశీ బాబులను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనను వేరే బ్యారక్ కు మార్చాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈరోజు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.