జడ్జి ముందు నిజాలు ఒప్పుకున్న పోసాని... ఏం చెప్పారంటే..!
- పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
- తాను మాట్లాడిన మాటలు నిజమేనని ఒప్పుకున్న పోసాని
- తన భార్యను తిట్టారని... ఆ బాధతోనే తాను అలా దూషించాల్సి వచ్చిందని వివరణ
మరోవైపు కోర్టులో వాదనల సందర్భంగా జడ్జి ముందు పోసాని వాస్తవాలను అంగీకరించారు. తన భార్యను దూషించారని... అందుకే ఆ బాధతో తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. తాను మాట్లాడిన మాటలు నిజమేనని అంగీకరించారు. తన భార్యను దూషించిన దూషణలను కట్ చేసి... బాధతో తాను మాట్లాడిన మాటలను మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను దూషించిన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించారని పోసాని పేర్కొన్నారు.